ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో దేహ దారుఢ్య పరీక్షలు ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ మైదానంలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు గత నెల 30 నుంచి నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సెలవులు అనంతరం గురువారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంపికకు గురువారం 727 మంది హాజరు కావాల్సి ఉండగా, 478 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో తుది రాత పరీక్షకు 317 మంది అర్హత సాధించారు. అభ్యర్థులకు క్రమ పద్ధతిలో ఎత్తు పరిశీలన, ఛాతీ కొలత, 1600 మీటర్లు పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ నిర్వహించి, అర్హత సాధించిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ నెల 18వ తేదీతో ఎంపిక ప్రక్రియ ముగియనుంది. తుది రాత పరీక్ష తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
–ఎచ్చెర్ల క్యాంపస్
మంది
317
Comments
Please login to add a commentAdd a comment