రాత్రి వేళల్లో కొండచిలువ సంచారం
వజ్రపుకొత్తూరు రూరల్: వనాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనాల మధ్య సంచరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మండలంలో గల బెండి గేటు, బెండి, సీతాపురం, గల్లి, తాడివాడ, మహాదేవపురం, కొండవూరు ప్రాంతాల్లో కొండ చిలువలు సంచరిస్తున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతుండడంతో జనం భయపడుతున్నారు. ఇటీవల బెండి గేటు– బెండి ఆర్‌అండ్‌బి రోడ్డుపై అడ్డంగా ఉన్న కొండ చిలువను తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు అనేకం జరిగాయని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment