ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
శ్రీకాకళమ కల్చరల్ : తరిణీ కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో శాంతాకల్యాణ్ అనురాగ నిలయంలో సద్గురు త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శృతిలయ సంగీత శిక్షణాలయం విద్యార్థులతో ఘన రాగ పంచరత్న కీర్తనలైన జగదానంద కారక (నాట రాగం), దుడుకుగల నన్నే దొర (గౌళ రాగం), సాధించెనే (ఆరభి రాగం), కనకన రుచిరా (వరాళీ రాగం), ఎందరో మహానుభావులు (శ్రీరాగం) చక్కగా గానం చేశారు. ముందుగా సి.వి.నాగజ్యోతి చారిటబుల్ ట్రస్టు అధినేత సి.వి.ఎన్.మూర్తి దంపతులు, వరసిద్ధి వినాయక పంచాయతన దేవస్థానం వ్యవస్థాపకులు జగన్మోహనరావు, రమాదేవి దంపతులు తిరువీధి ప్రారంభించారు. అనురాగనిలయం చిన్నారులు త్యాగయ్య వేషధారణలో తిరువీధి నిర్వహించారు. కార్యక్రమంలో వాయులీనంపై దూసి రమేష్, బ్రహ్మాజీ, మృదంగంపై మండ శ్రీనివాసరావులు వాద్య సహకారం అందించారు. కార్య క్రమంలో రెడ్డి సత్యనారాయణ, నిక్కు అప్పన్న, కనుగుల దుర్గా శ్రీనివాస్, ఎం.వి.కామేశ్వరరావు, బండారు రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment