రూ.లక్ష ఆర్థిక సాయం అందజేత
గార: మండలంలోని బూరవిల్లి గ్రామానికి చెందిన డిక్కల పద్మలోచన, వినీత దంపతుల చిన్న కుమారుడు చేతన్ గుండె వ్యాధితో, పెద్ద కుమారుడు శశాంక్ పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో సాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు. గ్రామస్తులు, యువత, స్నేహితులు సేకరించిన లక్ష రూపాయలను ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారులకు దీర్ఘకాలిక వ్యాధులు సోకడంతో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై ‘హృదయ వేదన’ పేరిట సాక్షిలో ఈ నెల 11న కథనం ప్రచురితమైంది. సంక్రాంతి సమయాల్లో కూడా విశాఖపట్నం ఆసుపత్రిలో ఉండటంతో ఆదివారం బూరవిల్లి వచ్చిన తల్లి వినీతకు సేకరించిన నగదును అందజేశారు. ఇప్పటివరకు రూ.10 లక్షల మేర ఖర్చు చేయడం, ఇంకా రూ.20 లక్షలు వరకు అవుతుందని వైద్యులు చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బోరవానిపేట సత్యసాయి భజనమండలి సభ్యులు రూ.50వేలు అందజేశారు. కార్యక్రమంలో ఎం.జనార్దన్, జి.ధర్మారావు, మల్ల రామారావు, ఎం.గోపి, మాధవనాయుడు, అయ్యప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment