కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకం
శ్రీకాకుళం క్రైమ్: ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విధులు చాలా కీలకమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. కోర్టులు, న్యాయస్థానాల మధ్య అనుసంధానంగా వ్యవహరించి నేరుస్తుల శిక్షల శాతం పెంచేలా శ్రమించడం కోర్టు కానిస్టేబుల్‌కే సాధ్యమని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ స్టేషన్ల కోర్టు సిబ్బంది, కోర్టు లైజన్ సిబ్బందితో కేసుల విచారణ విధానం, వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలు, సమన్లు, వారెంట్లు అమలు, సాక్షులను కోర్టులో హాజరుపర్చడం, కేసు అభియోగపత్రాల దాఖలు, ఇతరత్రా విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు నమోదు నుంచి తుది తీర్పు వరకు ప్రతి అంశాన్ని పూర్తి వివరాలతో సీసీటీఎన్‌ఎస్ అప్లికేషన్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రాసెస్‌ని ప్రతీరోజూ కేసు డైరీ రూపంలో జత చేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment