భారీ నగదుతో పట్టుబడిన పేకాటరాయుళ్లు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని హయాతినగరంలో పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. జూదమాడుతున్న 12 మంది వ్యాపారులను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.11,13,440 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ సీహెచ్ పైడపునాయుడు తెలిపారు. కాగా, ఇటీవలికాలంలో శ్రీకాకుళం రూర ల్, గార, ఆమదాలవలస, ఎచ్చెర్ల పీఎస్‌ల పరిఽ దిలో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతో అడ్డూఅదుపు లేకుండా శిబిరాలు జరుగుతున్నాయన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అది నగరానికి సైతం పాకింది. ఆదివారం హయాతినగరంలో పట్టుబడిన వ్యాపారులు, దొరకని కొంతమంది ఎప్పటినుంచో నగరంలో సైతం రహస్యంగా పేకాట ఆడుతున్నారని, వీరి వెనుక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో వీరికి ఉందన్న విషయం ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడం.. ఇప్పటికే ఇలాంటి కార్యకలాపాల్లో ఆరితేరిన సిబ్బంది పోస్టింగ్‌లను వేరే చోటుకు వేయడం జరుగుతోంది.
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారికి ఆనుకొని కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపంలో జరుగుతున్న పేకాట శిబిరంపై ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఏడుగురిని పట్టుకుని 7 సెల్‌ఫోన్లు, రూ.11000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జి.సిగడాం: మండలంలోని మెట్టవలస రెవెన్యూ పరిధిలో పేకాట శిబిరంపై జి.సిగడాం ఎస్‌ఐ వై.మధుసూదనరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.5640 స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏఎస్‌ఐలు పొగిరి శంకరరావు, కొరుకొండ రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
కానరాని యువకుడి ఆచూకీ
వజ్రపుకొత్తూరు రూరల్: మండల కేంద్రం వజ్రపుకొత్తూరుకు చెందిన యువకుడు జంగం తరుణ్ (16) శుక్రవారం తోటి స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. యువకుడి అచూకీ కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మైరెన్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న లభ్యం కాలేదు. తరుణ్ గల్లంతై మూడు రోజులు గడుస్తున్నా నేటికి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తీరంలో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టి కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
జంగం తరుణ్(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment