కిక్కిరిసిన ఆర్టీసీ కాంప్లెక్స్
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కిక్కిరిసింది. సంక్రాంతి పండగ ముగించుకుని స్వస్థలాలకు, గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో ప్రయాణికులతో కాంప్లెక్స్ కిటకిటలాడింది. వీరితో పాటు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు, వసతి కేంద్రాలకు చేరుకునేందుకు లగేజీతో చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. టికెట్లు సకాలంలో దొరక్క ఆపసోపాలు పడ్డారు. ప్రయాణికులకు సరిపడా బస్సులను సమకూర్చడంలో భాగంగా పల్లెవెలుగు బస్సులను సైతం నాన్‌స్టాప్ బస్సులుగా బోర్డులు తగిలించి నడిపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment