ఆసక్తి తగ్గిందా..?
ఎచ్చెర్ల క్యాంపస్: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం అంటే చాలా మంది యువతకు ఇదివరకు దీర్ఘకాలిక స్వ ప్నంలా ఉండేది. ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్న ఈ ఎంపిక ప్రక్రియ ప్రస్తుతానికి రెండు దశలు దాటింది. ప్రిలిమినరీ పరీక్ష, దేహ దారుఢ్య పరీక్ష, ఇక చివరి రాత పరీక్ష మాత్రమే ఉంది. ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించిన వారు చాలా మంది ఫిజికల్ టెస్టులకు హాజరు కాలేదు. తుది పరీక్షకు ఎంపికైన వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. ఎక్కువ మందికి ఆసక్తి లేకపోవడం వల్లే గైర్హాజరైన వారి సంఖ్య అధికంగా ఉందని చాలా మంది భావిస్తున్నారు.
వాస్తవంగా కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ అర్హత కాగా, ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది ఎంపిక ప్రక్రియకు హాజరయ్యారు. దేహ దారుఢ్య పరీక్షలు ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ మైదానంలో డిసెంబర్ నెల 30 నుంచి ఈ నెల 18వ తేదీ వరకు సెలవు రోజుల్లో మినహా నిర్వహించారు. జిల్లా నుంచి ప్రిలిమినరీ పరీక్షల్లో పురుష, మహిళా అభ్యర్థులు 7390 మంది అర్హత సాధించారు. వీరిలో దేహ దారుఢ్య పరీక్షలకు 4952 మంది మాత్రమే హాజరయ్యారు. 2951 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 2438 మంది దేహ దారుఢ్య పరీక్షలకు ఎంపిక కాలే దు. గతంలో అభ్యర్థులను స్క్రూట్నీ చేయటం కోసం ఐదు కిలో మీటర్లు అర్హతగా పరీక్ష నిర్వహించే వారు. 25 నిమిషాల్లో ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో విజేతలకు ఇతర దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసేవారు. ప్రస్తుతం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ద్వారా స్క్రూట్నీ చేశారు. వీరికి ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ నిర్వహించి అర్హత సాధించిన వారికి తుది పరీక్ష నిర్వహించి, ఉద్యోలకు రిజర్వేషన్ రోస్టర్, కొన్ని పోస్టులకు స్పోర్ట్సు మెరిట్, రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్లు పరుగు పందేంలో అర్హత సాధించ లేకపోయారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో నిర్వహించిన ఎంపిక ప్రక్రి య అన్ని దశలు దాటి వెళ్లాలి. ఎంపికపై స్పష్టమైన నమ్మకం లేని వారు హాజరు కాలేదు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పలు ఆర్మ్‌డ్ ఫోర్స్ ఉద్యోగాలకు వెళ్లిపోయారు. దీంతో గైర్హాజరు సంఖ్య ఎక్కువగా ఉందని నియామక ప్రక్రియలో పాల్గొన్న అధికారులు బావిస్తున్నారు. మరో పక్క ఎంపికై న అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ, ఆన్‌లైన్ శిక్షణ, బయట ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని ప్రిపరేషన్ ప్రారంభించారు. ఉద్యోగం సాధించాలంటే ఇప్పటికీ తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment