ఆరోగ్యశ్రీని అటకెక్కించేశారు
● వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస
సమన్వయకర్త రవికుమార్ ధ్వజం
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించేసిందని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ప్రతిరోజూ వేలాది మంది పేద రోగులకు వైద్యం అందక, ఆర్థిక స్తోమత లేక అవస్థలు పడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సుమారుగా 3,500 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రు ల్లో సైతం ఉచిత వైద్యసేవలు అందించేవారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ పేదల పథకాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఈ ప్రభుత్వం గడచిన ఏడు నెలలుగా సుమారుగా రూ.3,300 కోట్లు బకాయి పడిందని తెలిపారు. దీంతో ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ కేసులకు వైద్యం అందించడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. అంతే కాకుండా ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతులు కూడా రావడం లేదని అందోళన వ్యక్తం చేశారు. కొన్ని కేసులను తీసుకోకుండా బయిటకు పంపించేస్తున్నారన్నారు. ఆమ దాలవలస మండలానికి చెందిన ఒక వ్యక్తి ఈనెల 11న ప్రమాదానికి గురైతే ఆస్పత్రిలో చేర్పించారని, కానీ ఆయనకు ఇప్పటికీ ఆరోగ్యశ్రీ అనుమతులు రానందున శస్త్ర చికిత్స జరగలేదన్నారు. గడచిన పది రోజులుగా ఆయన సొంత ఖర్చులతో వైద్యం పొందుతున్నాడని, పేదలు ఈ పరిస్థితి వలన చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment