No Headline
నాకు చదువు రాదు. నీ భూమిని అమ్మేశారని మా పక్కింటివారు చెప్పడంతో నా గుండె జారిపోయింది. ఈ ఏడాది పంట వేసినప్పటికీ వర్షాలు లేకపోవడంతో పంట ఎండి పోయింది. భూమిని నమ్ముకొని జీవిస్తున్నాము. మా కడుపులు కొట్టొద్దు.
– బతకల దుర్గమ్మ, బాలకృష్ణాపురం
బాలకృష్ణాపురం గ్రామం పరిధిలో భూమి ఉందన్న విషయాన్ని గ్రహించిన విశాఖపట్నంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి స్థానిక టీడీపీ నాయకులతో కలసి బేరసారాలు ఆడారు. రైతులు ససేమిరా అనడంతో కొంత మంది రైతులను మభ్యపెట్టి తమ దారికి తెచ్చుకున్నట్లు భోగట్టా. ఈ నేపథ్యంలో మధ్యవర్తులుగా ఉన్న టీడీపీ నాయకులు బోరుబద్ర లోహిదాసు, కోట రామారావులు అడంగళ్ మార్చి 2024 అక్టోబర్ 7న బాలకృష్ణాపురం గ్రామానికి చెందిన బదకల మోహన్‌దాస్(0.35), బతకల ఢిల్లయ్య(0.40), బతకల చంద్రయ్య(0.55, 0.25), బతకల తులసయ్య(0.55, 0.25), బతకల దుర్గమ్మ(0.94), బతకల మహాలక్ష్మీ(0.36), బతకల భనయ్య(ఎకరం) భూములను సెంటు భూమి లేని నూకాల దాలమ్మ, ఇచ్ఛాపురం చెందిన ఆశి సోమేష్, కవిటి మండలానికి చెందిన బెందాళం జయప్రకాష్ వ్యక్తుల పేర్లపై ఆ భూములు ‘అనువంశికత’ అంటూ రిజిస్ట్రేషన్ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
నా భూమిని ఎలా అమ్మేస్తారు
అసలు విషయం ఇదీ..
Comments
Please login to add a commentAdd a comment