డార్మిటరీ భవనాలు చాలడం లేదు
గార: తమకు డార్మిటరీ భవనాలు చాలడం లేదని, ఒకే గదిలో ఎక్కువ మంది ఉండాల్సి వస్తోందని వమరవల్లి రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినులు ఏపీఆర్‌ఈఐ సెక్రటరీ వీఎన్ మస్తానయ్య దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం వమరవల్లి రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. డార్మిటరీ, వాష్‌రూమ్‌లు, తరగతి గదులు అన్ని నిశితంగా పరిశీలించారు. గత ప్రభుత్వం నాడు–నేడు కింద చేపట్టిన పనులను సిబ్బంది తెలియజేశారు. ఇంకా భవనాలు చాలకపోవడం వల్ల సెక్షన్ల వారీగా ఒకే గదిలో ఎక్కువ మంది ఉంటున్నారని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ కిషోర్‌కుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థినులతో కలసి భోజనం చేశారు. నాణ్యతలో తేడాలుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య వస్తే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు, ఎస్‌ఎంసీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ ఎస్. తిరుమల చైతన్య, ఎంఈఓ వినోదిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment