మధ్యవర్తిత్వంతో న్యాయ వివాదాల పరిష్కారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం ఒక ప్రభావవంతమైన మార్గమని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం అనే అంశంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులు, 40 గంటల శిక్షణ కార్యక్రమం జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రారంభమైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అధ్యక్షతన, జిల్లా వ్యాప్తంగా వివిధ బార్ అసోసియేషన్ల నుంచి ఎంపిక చేసిన పలువురు న్యాయవాదులు ఈ శిక్షణకు హాజరయ్యారు. ఈ శిక్షణలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను ఎలా పరిష్కరించాలి, దాని ప్రయోజనాలు, సవాళ్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి శిక్షణలు తోడ్పాటు అందిస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సీలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ (ఎంసీపీసీ) సభ్యులు అనూజా సక్సేనా, వీణా రళ్లి మాస్టర్ శిక్షకులుగా వ్యవహరిస్తారు
Comments
Please login to add a commentAdd a comment