No Headline
పోలాకి:
జిల్లాలో ఆక్వా రైతులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. సామాజిక మాధ్యమాల సాయంతో పలు రకాల సంస్థల సహకారంతో కొత్త కొత్త రకాలను పరిచయం చేసుకుంటున్నారు. వారిని మరింత ఉత్సాహ పరిచేలా వనామీలో కొత్తరకం జెనెటికల్ లైన్ ఇప్పుడు రికార్డు స్థాయిలో ఎఫ్‌పీఆర్ (ఫీడ్ కన్వర్షన్ రేషియో) నమోదవుతుంది. జిల్లాలో ఎక్కువ మంది రొయ్యల రైతులు ఇప్పుడు ఈ రకం రొయ్యల సాగు చేసేందుకు ఉత్సాహ పడుతున్నారు. జిల్లాలో రొయ్యల సాగు విస్తీర్ణం 4200 ఎకరాల వరకు ఉంటుంది.
ఏమిటీ ‘సై’ ఆక్వా
‘సై’ ఆక్వా అనేది ఫ్లోరిడాకు చెందిన తల్లిరొయ్యల ఉత్పత్తి సంస్థ. ఎప్పటికప్పుడు శాసీ్త్రయంగా కొత్త జెనెటిక్స్ ఎంపిక, ఎగ్ ప్రొడక్షన్, లార్వాల ఉత్పత్తి, ఉత్తమ స్థాయి ఆరోగ్య నిర్వహణ చేసి మేలు రకం ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. గతంలో టైగర్ రొయ్యల సాగు తర్వాత ఆక్వారంగం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. వనామీ రకం సాగుతో కొంత వరకు బయటపడింది. ఆ తర్వాత రొయ్యల సాగు ఇలాంటి కొత్త జెనెటికల్ లైన్స్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తోంది. వనామీలో సుమారుగా 10కి పైగా తల్లిరొయ్యల ఉత్పత్తి సంస్థలు వారి జెనెటికల్ లైన్స్‌ను హేచరీల ద్వారా అందిస్తున్నాయి. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ ఉత్పత్తుల వాడకం జరుగుతుంది. మూడేళ్ల కిందటే జిల్లా పరిచయమైన సై ఆక్వా బ్యాలెన్స్ లైన్ రికార్డు స్థాయిలో విజయవంతమైంది.
బ్యాలెన్స్ లైన్ ప్రత్యేకత
అందుబాటులో ఉన్న జెనెటికల్ లైన్స్‌తో పోల్చితే తక్కువ కాలంలో ఎక్కువ పెరుగుదల కనబరుస్తూ, వ్యాధులను తట్టుకుంటూ, చక్కటి ఎఫ్‌సీఆర్ నమోదు కావటం దీని ప్రత్యేకత. ఆక్వా సాగులో మేత వినియోగం కీలకం. సగానికిపైగా పెట్టుబడి ఫీడింగ్ కోసం వెచ్చిస్తారు. సాధారణంగా 1కిలో రొయ్యల ఉత్పత్తికి 1.1కిలో నుంచి 1.3కిలో వరకు మేత వినియోగం జరిగితే రొయ్యలసాగు లాభ దాయకం అనుకోవచ్చు. సై ఆక్వా సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు ఇదే ఎఫ్‌సీఆర్‌లో రొయ్యల ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో 1.5కు పైగా ఎఫ్‌సీఆర్ నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment