15కు విచారణ వాయిదా
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంతో తొలగించిన 34 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేబర్ కమిషనర్‌కు ఫిర్యా దు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ కూడలిలో ఉన్న లేబర్ కమిషన్ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అజయ్ కార్తీక్ శుక్రవారం విచారించారు. బాధితుల వాదన, వారు అందజేసిన డాక్యుమెంట్లు స్వీకరించారు. వర్సిటీ తరఫున హాజరైన న్యాయవాది వాదన విన్నా రు. అనంతరం విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.
పన్నుల చెల్లింపుల్లో జాప్యం వద్దు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వ్యాపారులు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పన్నులు సకాలంలో చెల్లించకుంటే చర్యలు తప్పవని అసిస్టెంట్ కమిషనర్ (రాష్ట్రపన్నులు) శ్రీకాకుళం సర్కిల్ జి.రాణీమోహన్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో శుక్రవారం జీఎస్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణీ మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉన్నందున సర్కిల్ రెవె న్యూ పెంచటానికి మీ వంతు కృషి చేయాలన్నారు. జీఎస్టీ రెగ్యులర్, కాంపోజిషన్ స్కీ ముల్లో కొనసాగుతున్న వారు డిసెంబర్ నెల ముగిసిన కాలానికి వెంటనే తమ రిటర్న్‌లను దాఖలు చేసి సంబంధిత పన్నులు చెల్లించాల న్నారు. నిర్ణీత సమయంలో చెల్లించని వారు చట్ట ప్రకారం అపరాధ రుసుము 18 శాతం వడ్డీతో చెల్లించాల్సి వస్తుందన్నారు. పన్ను బకాయిలను 31 మార్చి 2025 లోగా చెల్లించే వారికి అపరాధ రుసుము, వడ్డీని ప్రభుత్వం రద్దు చేసినందున, వెంటనే చెల్లించేలా చేయాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
గిరిజనులను రక్షించండి
● ఎస్టీ కమిషన్ సభ్యులకు మాజీ స్పీకర్ తమ్మినేని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధిలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దాన్ని నిలువరించి గిరిజనులను కాపాడాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎస్టీ కమిషన్ సభ్యుడు వి.శంకర్ నాయక్‌ను కోరారు. స్థానిక ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో శుక్రవారం ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే గిరిజన ప్రజల మనుగడ కనుమరుగైపోతుందన్నారు. ఈ ప్రాంతంలో నవోదయ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాల, ఇతర సంస్థలు ఉన్నాయని వాటి మనుగడ కూడా కష్టమవుతుందన్నారు. కమిషన్‌కి వినతి పత్రం అందజేసిన అనంతరం తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో 1600 ఎకరాలు, 3300 మెగావాట్లు విద్యుత్ ఉత్పాదన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కూటమి పన్నాగాలు చెల్లవని ఆయన అన్నారు. ప్రపంచమంతా థర్మల్‌ప్లాంట్‌లను వ్యతిరేకిస్తుంటే.. ఇక్కడ పెట్టడమేంటని ప్రశ్నించారు. రెండు నదుల నీటిని ఈ ప్రాజెక్టుకు కేటాయించడం కూడా దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికుల కు ఎలాంటి లాభం ఉండదని వివరించారు. ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు. గిరిజనులు చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు.
గిరిజన సంక్షేమమే లక్ష్యం..
ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడారు. గిరిజన సంక్షేమమే తమ లక్ష్యమని, అడవి బిడ్డలకు అన్యాయం జరిగితే సహించబోమని తెలిపా రు. మాజీ స్పీకర్ ఇచ్చిన వినతిలో ప్రతి అంశా న్ని కూలంకషంగా పరిశీలించి చర్యలు తీసు కుంటామన్నారు. థర్మల్ ప్రాజెక్టుపై ఇప్పటికే తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. థ ర్మల్ విద్యుత్ ప్రాజెక్టు పెట్టడం సరైన ప్రతిపాద న కాదని అయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment