ప్రభుత్వం దృష్టికి ఆదివాసీల సమస్యలు
బూర్జ: మండలంలోని అన్నంపేట పంచాయతీ అడ్డూరిపేట గ్రామంలో బూర్జ, సరుబుజ్జిలి మండలాల ఆదివాసీలు శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై గిరిజనులకు మనోధైర్యం కల్పించారు. ఏ ఒక్క ఆదివాసీకి కష్టం వచ్చినా అందరం కలసికట్టుగా పోరాటం చేద్దామని హామీ ఇచ్చారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ప్లాంట్ నిలుపుదలకు కృషి చేస్తానన్నారు. ఈ ప్లాంట్‌ను రెండు మండలాలకు చెందిన గోపిదేవిపేట, మసానపుట్టి, బూర్జ మానుగూడ, అనంతగిరిపేట, జంగాలపాడు, బొడ్లపాడు, జె.వి పురం, వెన్నెలవలస–1, వెన్నెలవలస–2తో పాటు సుమారుగా 20 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగా మాట్లాడుతూ పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రతిపాదనలు తక్షణమే ఆపాలన్నారు. ఆదివాసీల నెత్తిన కుంపటి పెట్టడం స్థానిక ఎమ్మెల్యేకు సమంజసమా అని నిలదీశారు. పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన విరమించే వరకు పోరాడదామన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ వైవీ పద్మావతి, ఎస్‌ఐ ఎం.ప్రవళ్లిక, ఈఓపీఆర్డీ పి.విజయలక్ష్మి, ఆదివాసి నాయకులు అప్పల నాయుడు, సురేష్ దొర, శశిభూషణ రావు, అప్పలనాయుడు, సవర సింహాచలం, సవర కృష్ణ, లక్ష్మణరావు, ధర్మారావు, సవర ప్రియాంక, పాలక విజయ తదితరులు పాల్గొన్నారు.
థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గిరిజనుల పోరాటం
ఎస్టీ కమిషన్‌సభ్యుడు
వడిత్యా శంకర్ నాయక్
Comments
Please login to add a commentAdd a comment