ఇక రాజులమ్మ జాతరే
శ్రీరాజరాజేశ్వరి (రాజమ్మ తల్లి)
విగ్రహం
● నేటి నుంచి వత్సవలస
రాజమ్మ తల్లి జాతర
● ఈ ఏడాది పది వారాల పాటు జరగనుందని జాతర దాసుడు పేరయ్య వెల్లడి
● వన్‌వేలో వాహనాలు, భక్తులు రావాలని సూచిస్తున్న పోలీసులు
గార:
మండలంలోని చిన్న వత్సవలసలో కొలువైన రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరిదేవి) జాతర శనివారం నుంచి మొదలుకానుంది. శనివారం రాత్రి కి వచ్చే భక్తులు ఇక్కడే బస చేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి)తో పాటు భూలోకమ్మ తల్లిని ఆది వారం దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. వేకువ జామున సమీపంలోని సముద్రంలో స్నానాలాచరించి, కుటుంబ సమేతంగా ఇక్కడే వంట చేసుకుంటారు. ఆది పీఠాలైన మైలపల్లి పేరయ్యదాసు, శ్రీనివాసదాసు, జయమ్మల ఐదు ఉండగా, ఇప్పుడు 15 పీఠాల వరకు ఏర్పడ్డాయి. ఈ జాతరకు ఏడాదికి ఒక్కసారైనా రావాలన్న నిబంధన ఉంది. ముఖ్యంగా ఆయా కుటుంబాల్లో పు ట్టిన చిన్నారికి పుట్టు కొప్పు (తలనీలాలు)ఇక్కడ తీయించి మొక్కులు తీర్చుకుంటే ఆ చిన్నారికి మంచి భవిష్యత్ ఉంటుందని భక్తుల్లో నమ్మకం. అందుకే మత్స్యకారుల్లో మషేను, పేరయ్య, దాసు వంటి పేర్లు అధికంగా ఉంటాయి.
రాత్రి వేళ గట్టి నిఘా..
రాజమ్మ తల్లి జాతరకు పటిష్ట బందోబస్తులో భాగంగా రాత్రి వేళ గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వత్సవలస గ్రామస్తు లు, భక్తులు, పోలీసులు, మండల స్థాయి అధికారుల సమన్వయంతో జాతరను జరిపించేందుకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా వన్‌వే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆర్టీసీ వత్సవలస జాతరకు ప్రత్యేక బస్‌లు నడుపుతోంది.
15 ఏళ్లుగా వస్తున్నా
పదిహేను ఏళ్లుగా రాజమ్మ తల్లి జాతరకు వస్తున్నాను. ఈ ఏడాది విశాఖపట్నంలో పెళ్లి కారణంగా ముందుగా వచ్చాను. ఏది ఏమైనా సంక్రాంతి తర్వాత తల్లిని దర్శించుకుంటున్నాను. మా కుటుంబ సభ్యులందరం వచ్చి ఇక్కడే వంట లు చేసుకొని జాగరణ చేస్తాం. మా బాబు చిన్నారి పుట్టు కొప్పు ఇక్కడే తీశాం.
– హైమావతి, చీరాల, భక్తురాలు
పది వారాలుగా...
ఈ ఏడాది పదివారాలు పాటు జాతర జరగనుంది. మూడు మాసాల పాటు స్వతంత్రంగా జాతర నిర్వహించుకుంటున్నాం. – మైలపిల్లి పేరయ్య,
ప్రధాన పీఠం దాసుడు,చిన వత్సవలస
Comments
Please login to add a commentAdd a comment