మాట్లాడుతున్న మధుకర్‌రెడ్డి
చౌటుప్పల్: జనవరి 5వ తేదీ నుంచి ఆర్టీసీలోని అద్దె బస్సులను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బా మధుకర్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో గురువారం జరిగిన అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకంతో తాము తీవ్రంగా నష్టాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒక్కో బస్సులో పరిమితికి మించి 100–120 మంది రాకపోకలు సాగిస్తున్న కారణంగా టైర్లు పగిలిపోతున్నాయన్నారు. బస్సుల యాజమాన్యాలకు నిర్వహణ భారంగా మారుతోందన్నారు. టైర్ల అరుగుదలతోపాటు డీజిల్ సైతం అధికంగా ఖర్చు అవుతుందన్నారు. అద్దె బస్సుల కేఎంపీల్‌ను 4.5కు తగ్గించాలని, కిలోమీటర్‌కు ఇప్పుడు చెల్లిస్తున్న ధరకు అదనంగా రూ.3 పెంచాలన్నారు. ఆర్టీసీకి టైర్లు ఎంత ధరకు లభిస్తున్నాయో తమకు సైతం అదే ధరకు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోగా హైదరాబాద్‌లో టెండర్లు పిలవడం తగదన్నారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకాంతం మహిపాల్‌రెడ్డి, కోశాధికారి ఎన్.సత్యంబాబు, ప్రతినిధులు కందాల శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, సి.బలవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అద్దె బస్సుల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బా మధుకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment