భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు | mad life End In hyderabad | Sakshi
Sakshi News home page

భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు

Published Tue, Jan 14 2025 8:10 AM | Last Updated on Tue, Jan 14 2025 8:10 AM

mad life End In hyderabad

కుమార్తెతో తండ్రి అసభ్య ప్రవర్తన

 

 

చివ్వెంల (సూర్యాపేట): కన్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడిని అతడి ఇద్దరు భార్యలు రోకలిబండతో మోది హత్య చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా గ్రామంలో సోమవారం తెల్లవా రుజామున ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుర్రంతండాకు చెందిన రత్నావత్‌ సైదులు (40) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను 2003లో నకిరేకల్‌ మండలం కోడూరు గ్రామానికి చెందిన రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. రమ్య డెలివరీ సమయంలో వీరి ఇంటికి వచ్చిన ఆమె చెల్లెలు సుమలతను సైదులు శారీరకంగా లోబర్చుకుని గర్భవతిని చేయడంతో ఆమెను కూడా 2013లో వివాహం చేసుకున్నాడు. సైదు లు, సుమలత దంపతులకు ఒక కుమారుడు సంతానం. ఇంటర్మీడియట్‌ చదువు తున్న సైదులు, రమ్య దంపతుల చిన్న కుమార్తె ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతోంది. సంక్రాంతి పండుగకు పెద్ద కుమార్తె స్వగ్రామానికి వచ్చింది. ఆమెను తండ్రి సైదులు ఆదివారం సూర్యాపేటకు షాపింగ్‌కు తీసుకెళ్లి దుస్తులు కొనిచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొత్త దుస్తులు మార్చుకుంటున్న కుమార్తె పట్ల సైదులు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె జరిగిన విషయం తల్లికి చెప్పింది. 

అంతటితో ఆగకుండా రాత్రి మద్యం సేవించి వచ్చిన సైదులు.. సోమవారం తెల్లవారు జామున ఇంట్లో మంచం మీద నిద్రిస్తున్న పెద్ద కుమార్తె పట్ల మరోసారి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిని నిద్ర లేపి జరిగిన విషయం చెప్పింది. దీంతో కోపోద్రిక్తురాలైన రమ్య, ఆమె చెల్లెలు సుమలత కలసి రోకలిబండతో సైదులు తలపై మోది, గొంతు పిసికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ నాగరా జు, ఎస్‌ఐ వి. మహేశ్వర్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement