టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) జిల్లా కమిటీని సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాపర్తి రామ నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల వీరన్న, రాష్ట్ర కౌన్సిలర్లుగా భిక్షం, పూలన్, కోటయ్య, ఉపాధ్యక్షులుగా బండారి శ్రీనివాస్, ఎ.హన్మంతరావు, పి. సైదులు, బడుగుల సైదులు, యాకయ్య, ఎం.చంద్రయ్య, రాజు, కై లాసపు వెంకటేశ్వర్లు, కార్యదర్శులుగా మల్లారెడ్డి, ఎం.కృష్ణమూర్తి, కె. కిరణ్, ఎన్.చంద్రా రెడ్డి, పి.నరసయ్య, జానయ్య, కె.మల్లారెడ్డి, బి. వెంకటనారాయణ, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ప్రతాప్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
అతిగా యాంటీబయోటిక్స్ వాడకంతో దుష్ప్రభావం
సూర్యాపేటటౌన్ : అతిగాయాంటీబయోటిక్స్ మందులు వాడటం వల్ల ఆరోగ్యంపైదుష్ప్రభావం చూపుతాయని జిల్లా వైదారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. సోమవారం సూర్యాపేటలో హైదరాబాద్‌కు చెందిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, స్టాఫ్ నర్సులకు వ్యాధినిరోధక టీకాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు పెట్టొద్దు
కోదాడ: ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని జిల్లా సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్ పద్మజ కోరారు. కోదాడ మండల పరిధిలోని బాలాజీనగర్, తమ్మర వద్ద కోదాడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. రైతులు కూడా నిబంధనల మేరకు ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఆమె వెంట కోదాడ పీఏసీఎస్ అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
సీపీఐ వందేళ్ల వేడుకలు విజయవంతం చేయాలి
మునగాల: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26నాటికి వందేళ్లు పూర్తవుతున్నందున నిర్వహిస్తున్న వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. వేడుకల్లో భాగంగా వచ్చేనెల 30న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను సోమవారం మునగాల మండలం కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ధూళిపాళ ధనుంజయ నాయుడు, ఎల్లావులు రాములు, మేకల శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, షేక్ లతీఫ్, గుండు వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, దేవరం మల్లీశ్వరి, పార్టీ మునగాల మండల కార్యదర్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment