25లోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తిచేయాలి
మునగాల: ఇందిరమ్మ ఇళ్ల ఇంటింటి సర్వేను ఈ నెల 25లోగా పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హౌసింగ్ శాఖ ఈఈ) విజయ్‌సింగ్ అన్నారు. గురువారం ఆయన మునగాల మండలం కొక్కిరేణి, తిమ్మారెడ్డిగూడెం, గణపవరం గ్రామాల్లో సిబ్బంది చేస్తున్న సర్వే తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేలో ఎటువంటి పొరపాట్లు తలెత్తకుండా పారదర్శకంగా సర్వేను నిర్వహిస్తూ వేగంగా రిపోర్టు సబ్మిట్ చేయాలని, దరఖాస్తుదారులు అందుబాటులో లేకుంటే ఫోన్ వాట్సాప్ ద్వారా ఇందిరమ్మ కమిటీలకు తెలియచేసి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ ఏఈ జేఎస్‌ఎన్.మూర్తి, వర్క్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్లా, ఎంపీఓ దార శ్రీనివాస్, గణపవరం, తిమ్మారెడ్డిగూడెం పంచాయతీ కార్యదర్శులు దేవిరెడ్డి వీరారెడ్డి, జావెద్, కొక్కిరేణి బిల్ కలెక్టర్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ హౌసింగ్ ఈఈ విజయ్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment