కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి
భానుపురి (సూర్యాపేట): భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానుమంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం సూర్యాపేటలోని కొత్తబస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమని, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లేనన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, పోలగాని బాలుగౌడ్, రుద్రంగి రవి, నాగుల వాసు, గండూరి రమేష్, చిరివెళ్ల శభరి, తంగెళ్ల కరుణాకర్‌రెడ్డి, ఆలేటి మాణిక్యం, రావుల రాంబాబు, పిడమర్తి రాజు, జావేద్ బేగ్, నాని, గడ్డం వెంకన్న, సాజిద్, జమండ్ల సత్యనారాయణరెడ్డి, చెంచల నిఖిల్, రణబోతు సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment