ఆటలు ఆడేదెలా..!
కోదాడ: పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 243 గ్రామ పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేయగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపయోగంలో లేవు. ఇక.. మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల పేరుతో కేవలం బోర్డులు మాత్రమే ఏర్పాటు చేసి రూ.లక్షల నిధులు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.
అనువుగాని చోట ఏర్పాటు
గత ప్రభుత్వ హయాంలో క్రీడామైదానాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీల్లో వీటి ఏర్పాటుకు కావలసిన భూమిని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సేకరించి క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ వివిధ క్రీడలకు కావాల్సిన కనీస సౌకర్యాలు, క్రీడా పరికరాలను సమకూర్చాల్సి ఉంది. మున్సిపాలిటీల్లోలే అవుట్ కింద వచ్చిన స్ధలాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల ముందు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోవడమే కాక యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో అనువైన స్థలాన్ని ఎంపిక చేయకుండా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు. వీటిని అభివృద్ధి చేయడానికి నాటి సర్పంచ్‌లు సొంత నిధులు ఖర్చు చేశారు. అయితే కొన్నిచోట్ల ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షలు సరిపోక మధ్యలోనే క్రీడాప్రాంగణాల అభివృద్ధి ఆగిపోయింది. నూతన ప్రభుత్వం రావడం, సర్పంచ్‌ల కాలపరిమితి తీరిపోవడంతో క్రీడాప్రాంగణాలను పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలతో రూపురేఖలు కోల్పోయి బోర్డులు మాత్రమే మిగిలాయి.
వినియోగంలోకి తీసుకురావాలి
తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం నిధులు కేటాయించి వీటిని తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడతాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న క్రీడా మైదానాలను కూడా మెరుగుపర్చాలి. కావాల్సిన క్రీడా పరికరాలను అందుబాటులో ఉంచాలి.
– వీరభద్రం, వాలీబాల్ క్రీడాకారుడు, కోదాడ
ఫ వృథాగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు
ఫ జిల్లా వ్యాప్తంగా 243 గ్రామ
పంచాయతీల్లో ఏర్పాటు
ఫ ప్రస్తుతం ఎక్కడ చూసినా కంపచెట్లతో దర్శనమిస్తున్న క్రీడా మైదానాలు
Comments
Please login to add a commentAdd a comment