కలెక్టరేట్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు
భానుపురి (సూర్యాపేట): కలెక్టరేట్‌లో శనివారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాంబాబు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ యూనియన్ సూర్యపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కే. జానిమియా, దున్న శ్యామ్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికారులు కోటచలం, కొమ్ము శంకర్, కిషన్, జగదీష్ రెడ్డి, నాగయ్య, శ్రీనాథ్, సైదులు, సతీష్, వెంకటయ్య, శోభారాణి, నిఖిలేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment