విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
ఫ జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కౌన్సిల్
సెక్రటరీ శ్రీవాణి
మునగాల: విద్యార్థులు విద్యతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ సెక్రటరీ శ్రీవాణి అన్నారు. శనివారం మునగాల మండలం ఆకుపాముల శివారులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాల, పాఠశాలలో కోదాడ మండల లీగల్‌సెల్ అథారిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో భోజనశాల, వసతిగదులను పరిశీలించి పాఠశాల ప్రిన్సిపాల్‌కు తగిన సూచనలు చేశారు. కోదాడ మండల లీగల్‌సెల్ అథారిటీ కౌన్సిల్‌సెల్ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అధ్యక్షత నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఆర్‌కె.మూర్తి, సీహెచ్.రామిరెడ్డి, సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రెడ్డి, మల్లయ్య, కోదాడ కోర్టు న్యాయవాదులు, పాఠశాల ప్రిన్సి పాల్ శోభారాణి, వైస్ ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులను పదిలంగా చూసుకోవాలి
మునగాల: అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులను పదిలంగా చూసుకోవాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ సెక్రటరీ శ్రీవాణి అన్నారు. శనివారం మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామపంచాయతీ శివారులో గల ఇందిర అనాథ వృద్ధాశ్రమాన్ని ఆమె సందర్శించారు. భవిష్యత్‌లో ఆశ్రమానికి తన వంతు సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఆర్‌కె.మూర్తి. సీహెచ్.రామిరెడ్డి, సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రెడ్డి, మల్లయ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ సత్యనారాయణ పిళ్లే, వెంకటరత్నం, వాణి, డీఎల్‌ఎస్‌ఏ మెంబర్ ఏ.అశోక్, కోదాడ బార్ అసోసియేషన్ సభ్యులు తాటి మురళి, వీరభద్రరావు, లక్ష్మీకాంత్, వాస్తునిర్మాణ వెంకటనర్సయ్య, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, ఏఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
హుజూర్‌నగర్: న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత లేని ఖైదీలకు న్యాయ సేవ అధికార సంస్థ తరఫున న్యాయవాదిని నియమించి, ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి తెలిపారు. శనివారం హుజూర్‌నగర్ సబ్ జైలును ఆమె సందర్శించారు. ఆమె వెంట న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్ రాఘవరావు, ఆర్ వెంకటేష్, జిల్లా ఉచిత న్యాయ సహాయ న్యాయ వాదులు సత్యనారాయణ పిల్లె, వెంకటరత్నం, ప్రవీణ్, సబ్ జైల్ సూపరింటెండెంట్ మంగ్తా నాయక్, జైల్ సిబ్బంది మంత్రి ప్రగడ సీతా రామచంద్రరావు, ప్రవీణ్, రావకష్ణ, సైదిరెడ్డి, మౌలాబి, శారద ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment