చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చట్టాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండడంతోపాటు సెల్ ఫోన్ వినియోగం తగ్గించుకుని పట్టుదలతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. బైక్‌లపై త్రిబుల్ రైడింగ్ చేయరాదన్నారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, డిఫెన్స్ కౌన్సిల్స్ వసంత సత్యనారాయణపిళ్లే యాదవ్, బొల్లెద్దు వెంకటరత్నం, భట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు ఏడిండ్ల అశోక్, గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి
Comments
Please login to add a commentAdd a comment