‘పేట’కు చేంజ్ మేకర్స్ అవార్డు
వ్యసనాలకు బానిసై..
ఓ యువకుడు చెడు వ్యసనాలకు బానిసగా మారి గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
- 8లో
సూర్యాపేట: స్వచ్ఛ సర్వేక్షన్‌లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు సూర్యాపేట మున్సిపాలిటీకి చేంజ్ మేకర్స్ అవార్డు లభించింది. చేంజ్ మేకర్స్ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్‌లో పలు అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్, ఎంఓహెచ్‌యూఏ సంయుక్తంగా ఢిల్లీలో గురువారం డాక్టర్ సునితనరైన్ చేతుల మీదుగా చేంజ్ మేకర్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో సూర్యాపేట మున్సిపాలిటీకి వచ్చిన అవార్డును ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ చిప్పలపల్లి శివప్రసాద్ అందుకున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి చేంజ్‌మేకర్స్ అవార్డు రావడం పట్ల చైర్‌పర్సన్ అన్నపూర్ణ, కమిషనర్ శ్రీనివాస్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన పారిశుద్ధ్య అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment