రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక

Published Sat, Dec 21 2024 1:36 AM | Last Updated on Sat, Dec 21 2024 1:36 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక

సూర్యాపేట టౌన్‌: జిల్లా స్థాయి సీఎం కప్‌ జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ 100 మీటర్ల లాంగ్‌ జంప్‌ పోటీల్లో ఆత్మకూరు(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన మేడి నాగయ్య కుమార్తె అనూష మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. శుక్రవారం సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ క ళాశాలలో జరిగిన సీఎం కప్‌ జూనియర్‌ అండర్‌–16 బాలికల అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల లాంగ్‌ జంప్‌లో అనూష విజయం సాధించింది. అనూష హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఇ ం టర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఈనెల 31, వచ్చే ఏడాది జనవరి 1, 2 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది.

కోర్టులో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా

చివ్వెంల: సూర్యాపేట జిల్లా కోర్టులో నెలకొన్న సమస్యలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా పోర్ట్‌ పోలియో జడ్జి జస్టిస్‌ మాధవిదేవి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైకోర్టులో గల తన చాంబర్‌లో జస్టిస్‌ మాధవిదేవిని సూర్యాపేట బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతన కోర్టు నిర్మాణం, జువైనల్‌ కోర్టు మంజూరు విషయమై ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆమె పైవిధంగా స్పందించారని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, కోశాధికారి ధరావత్‌ వీరేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ బిల్లులు

వెంటనే చెల్లించాలి

పెన్‌పహాడ్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, సరెండర్‌ సెలవులు, బకాయి బిల్లులు వెంటనే క్లియర్‌ చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి చిలక రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెన్‌పహాడ్‌ మండలం చెట్లముకుందాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో నూతన ఉపాధ్యాయులకు శుక్రవారం సంఘం సభ్యత్వాలు అందజేసి మాట్లాడారు. విద్యారంగంలో పర్యవేక్షణ అధికారుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినీమం టైం స్కేలు వర్తింజేయాలన్నారు. అదేవిధంగా మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు కె.వీరేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి బి.రాంజీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలి

సూర్యాపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షడు, న్యాయవాది తల్లమల్ల హసేన్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు బొల్లెద్దు దశరథ డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో అమిత్‌ షా అనుచిత వ్యాఖ్య లను నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతుబజార్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో వీర్జాల వేణుబలరాం, కట్ల మురళి, బొల్లెద్దు వినయ్‌, అసొద రవి, అఖిల్‌, రామకృష్ణ, సైదులు, కరుణాకర్‌, నాగరాజు, భద్రచాలం, నరేందర్‌, సాగర్‌, రవి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రాష్ట్ర స్థాయి  అథ్లెటిక్స్‌కు ఎంపిక
1
1/3

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక

రాష్ట్ర స్థాయి  అథ్లెటిక్స్‌కు ఎంపిక
2
2/3

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక

రాష్ట్ర స్థాయి  అథ్లెటిక్స్‌కు ఎంపిక
3
3/3

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement