సాదాబైనామాపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

సాదాబైనామాపై ఆశలు

Published Sat, Dec 21 2024 1:36 AM | Last Updated on Sat, Dec 21 2024 1:36 AM

సాదాబైనామాపై ఆశలు

సాదాబైనామాపై ఆశలు

భూభారతి చట్టం ద్వారా అందనున్న పట్టాలు

25,430 దరఖాస్తులు మూలకు..

ఉమ్మడి జిల్లాలో 25,430 సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయి. అందులో నల్లగొండ జిల్లాలో 13,080, సూర్యాపేటలో 8,564, యాదాద్రి జిల్లాలో 3,786 దరఖాస్తులు వచ్చాయి. వారంతా మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్ల కిందట సాదా కాగితంపై భూమి కొనుగోలు చేసి రాయించుకున్న వారిలో అనేక మంది పేర్లు మార్చుకొని పట్టాలు తీసుకోలేదు. ధరణికి ముందున్న ఆర్‌ఓఆర్‌ చట్టంలో సాదాబైనామాలతో పట్టాలు చేశారు. ధరణి వచ్చిన తర్వాత అవి ఆగిపోయాయి. అయితే వాటిని అమలు చేసేందుకు గత ప్రభుత్వం పూనుకోగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25,430 దరఖాస్తులు వచ్చాయి. అమలులో జాప్యం చేయడం, ఆ తర్వాత ఎన్నికలు రావడంతో అవి మూలన పడ్డాయి.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న భూభారతి ఆర్‌ఓఆర్‌ – 2024 చట్టం ద్వారా సాదాబైనామాలకు మోక్షం కలగనుంది. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా దరఖాస్తుదారులను పరిష్కరిస్తామని ప్రభుత్వం చట్టంలో స్పష్టం చేసింది. దీంతో సాదాకాగితంపై రాసుకుని భూమిని కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా ఉన్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. మూడేళ్ల క్రితమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాదాబైనామా కోసం 25,430 దరఖాస్తుల వచ్చాయి. కొత్త చట్టం ద్వారా ఎలాంటి సమస్యలు లేని సాదాబైనామాలను ప్రభుత్వం మొదట పరిష్కరించనుంది. సమస్యలుంటే విచారణ చేసిన తరువాత పరిష్కారం చూపనుంది.

ధరణిలో కనిపించని ఆప్షన్లు..

గత ప్రభుత్వం ఽ2020లో ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి దాని ద్వారానే భూ నిర్వహణను కొనసాగించింది. అయితే ధరణిలో అన్ని రకాల ఆప్షన్లు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో సాదాబైనామాలు కూడా ఒకటి. ధరణిలో సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల కోసం ఆప్షన్లు లేకపోవడంతో చాలా మంది గత ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. వారి విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి ప్రభుత్వం సాదాబైనామాలను పరిష్కారానికి చర్యలు చేపడతామని మూడేళ్ల కిందటే దరఖాస్తులు స్వీకరించింది.

ఏళ్లుగా ఎదురుచూపు

సాదాబైనామా సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం జాప్యం చేసింది. దీంతో ఆయా దరఖాస్తుదారులంతా సాదాబైనామాల రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా భూభారతి ఆర్‌ఓఆర్‌ చట్టం–2024ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. త్వరలోనే చట్టం అమల్లోకి రానుంది. దాంతో సాదాబైనామా సమస్య పరిష్కారం కానుంది.

ఫ ఉమ్మడి జిల్లాలో 25,430 దరఖాస్తులు పెండింగ్‌

ఫ ఎలాంటి సమస్య లేనివాటికి మొదట పరిష్కారం

ఫ దరఖాస్తుదారుల ఎదురుచూపులకు

తెర పడే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement