కేటీఆర్‌ను జైలుకు పంపాలని కుట్ర
సూర్యాపేట టౌన్: రాజకీయంగా ఎదుర్కొలేకే మాజీ మంత్రి కేటీఆర్‌ను జైలుకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పంపుతోందని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దిగ్గజం కేటీఆర్ అన్నారు. నిజంగా అవినీతి జరిగితే కేటీఆర్ చెప్పినట్లు అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్థంలేని ఆరోపణలు చేస్తూ.. బీఆర్‌ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందన్నారు. సమావేశంలో సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జీడి భిక్షం, బూర బాలసైదులుగౌడ్, రాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment