అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
భానుపురి (సూర్యాపేట) : అర్హులను గుర్తించేందుకే ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు తప్పకుండా వారానికి రెండుసార్లు సర్వే వివరాలపై సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలన్నారు.
పెద్దగట్టు జాతరను విజయవంతం చేయాలి
అన్నిశాఖలు సమన్వయం చేసుకుంటూ పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. పెద్దగట్టు జాతర ఏర్పాట్లపై వివిధ శాఖలఅధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జాతర కోసం 70 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. గట్టుపై భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎండ తగలకుండా చల్లని చలువ పందిరి, గుడి చుట్టూ కలరింగ్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ సమస్య లేకుండా, వ్యర్థాలను తరలించేందుకు ఎక్కువ సిబ్బంది, ట్రాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాగునీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకోవాలని, అప్రోచ్ రోడ్లు త్వరగా పూర్తి చేయాలని, కోనేరు వద్ద కలర్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ రవి, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీఈఓ అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులు త్వరగా పూర్తి చేయాలి
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఆరు కేటగిరీల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఎంపీఓలు, ఈసీలతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్, మహిళాశక్తి, ఉపాధి భరోసా పథకంలో క్యాంటీన్ షెడ్లు, అజోల, నాడప్ కంపోస్ట్ పిట్, వర్మి కంపోస్ట్, పౌల్ట్రీ షెడ్ వంటి పనులను చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో 50 రకాల కన్నా ఎక్కువ మొక్కలను పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీఆర్‌డీఓ పీడీ అప్పారావు, డీపీఓ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment