2024 సంవత్సరంలో పలు శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రధానంగా పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నియామకం పూర్తయింది. వారంతా ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధుల్లో చేరారు. వైద్యారోగ్యశాఖలో స్టాఫ్ నర్సుల, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, రేడియాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు తదితర పోస్టులను భర్తీ చేసింది. వారికి వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖతో పాటు మెడికల్ కళాశాలల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. గురుకులాల్లో వివిధ కేటగిరిల్లో ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రధానంగా జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్ తదితర పోస్టులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి పోస్టింగ్‌లు ఇచ్చింది. వీటితో పాటు ఇతర శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. సీడీపీఓ, డీఏఓ పరీక్షలు నిర్వహించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో కూడా ఏఈల నియామకంతో పెద్ద ఎత్తున జిల్లాలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment