వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం
వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. స్వల్పకాలిక రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డుల రుణపరిమితిని రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచనుంది. దీంతో జిల్లాలోని 2,70,853 మంది రైతులు ఈ రుణాలు పొందే అవకాశం కలగనుంది. అలాగే పప్పుదినుసుల కొనుగోలు కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయనుండడంతో ఈ పంటలకు మద్దతు ధర దక్కనుంచి. జిల్లాలో ఈ పంటల సాగు ఏటా వెయ్యి ఎకరాలు కూడా మించడం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పప్పు దినుసుల సాగు పెరిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment