కమనీయం.. సీతారాముల కల్యాణోత్సవం | Sakshi
Sakshi News home page

కమనీయం.. సీతారాముల కల్యాణోత్సవం

Published Tue, Apr 23 2024 8:30 AM

-

కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్‌లోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం రాత్రి సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీ రామనవమి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర పంతుల బృందం శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివార్లను విశేషంగా అలంకరించారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని జరిపించా రు. ఈ కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి, పులకించారు. ముందుగా హనుమంత వాహనం పై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కలిపంచారు. దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు ఊరా ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణం హరికథా గానం భక్తులను అలరించింది. హనుమంత వాహన సేవకు పసుపుకొమ్ముల వ్యాపారులు, సీతారాముల కల్యాణానికి కొత్తపురం శ్రీరామ్‌ ఉభయకర్తలుగా వ్యవహరించారు.

Advertisement
Advertisement