విద్యార్థులకు మారథాన్ పోటీలు
వేలూరు: మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతిని పురష్కరించుకొని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మారథాన్ పోటీలు నిర్వహించారు. వేలూరు బ్రహ్మపురం నుంచి ప్రారంభమైన ఈ పోటీలను కలెక్టర్ సుబ్బలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ పోటీలు కాట్పా డిలోని ఒకటవ జోన్ వరకు సాగింది. పోటీలను మూడు విభాగాలుగా నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్నా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మారథాన్, సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే వేలూరు జిల్లాలోను సైక్లింగ్, మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో మొదటి స్థానం సాధించిన వారికి రూ.5వేలు, రెండవ స్థానం సాధించిన వారికి రూ.3 వేలు, మూడవ స్థానం సాధించిన వారికి రూ.2 వేల బహుమతితో పాటు సర్టిఫికెట్‌ను అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment