సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. త్వరలో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉదయం 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి ఆయన ముంబై వెళ్తారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంతోపాటు విలే కరుల సమావేశంలో పాల్గొంటారని తెలిపా యి.
అనంతరం శనివారం రాత్రికి రేవంత్ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. శుక్రవారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి.. శనివారం ఉదయం జార్ఖండ్ బయలుదేరి వెళ్తారు. శని, ఆదివారాల్లో అక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. ఆదివారం రాత్రికి హైదరాబాద్ తిరిగి రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment