కాంగ్రెస్‌కు ఓటు వేయనందుకే కూల్చివేతలు | KTR assures the victims of Moose in Golnaka | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓటు వేయనందుకే కూల్చివేతలు

Published Wed, Oct 2 2024 4:53 AM | Last Updated on Wed, Oct 2 2024 4:53 AM

KTR assures the victims of Moose in Golnaka

నగర ప్రజలపైపగబట్టిన సీఎం రేవంత్‌రెడ్డి 

పేదల ఇళ్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం... గోల్నాకలో మూసీ బాధితులకు కేటీఆర్‌ భరోసా 

అంబర్‌పేట (హైదరాబాద్‌):  కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నగర ప్రజలపై కక్ష కట్టి వారి ఇళ్లు కూల్చివేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. అడ్డి మార్‌ గుడ్డి దెబ్బగా సీఎం అయిన రేవంత్‌రెడ్డి కనీస అవగాహన లేకుండా అడ్డగోలు పాలన చేస్తూ ఆక్రమణలంటూ పేదలను రోడ్డు పాలు చేయడం అన్యాయమన్నారు. 

పేదల నివాసాలను కూలుస్తామంటే బీఆర్‌ఎస్‌ పార్టీ చూస్తూ ఉరుకోదన్నారు. మంగళవారం నగర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లతో కల సి అంబర్‌పేట నియోజకవర్గంలోని మూసీ పరీ వాహక ప్రాంతంలో ఆయన పర్యటించారు. గోల్నా క డివిజన్‌లోని న్యూ తులసీరామ్‌నగర్, లంకబస్తీ లు, అంబేడ్కర్‌నగర్‌ ప్రాంత బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.  

భయపెడుతున్నారు 
‘తమ ప్రభుత్వ హయాంలో కూడా మూసీ సుందరీకరణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సు««దీర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించాం. మూసీ అభివృద్ధికి కసరత్తు చేసి నివేదిక తయారు చేశాం. కానీ ఇది అమలు చేస్తే మెజార్టీ ప్రజలు నష్టపోతారనే విషయాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాం. పేదలకు నష్టం వాటిల్లే అభివృద్ధి మనకు వద్దని ఆయన చెప్పడంతో విరమించుకున్నాం. 

బతుకమ్మ, దసరా పండుగ సంబురం లేకుండా కూల్చివేతలతో పేదలను సీఎం భయపెడుతున్నారు’ అని కేటీఆర్‌ మండిపడ్డారు. పేదల గూళ్లను తొలగించి మాల్స్‌ కట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. 50 కిలోమీటర్ల మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లతో అంచనాలు రూపొందించడం ఎవరి జేబులు నింపడానికని ప్రశ్నించారు.
  
కిషన్‌రెడ్డి ఎక్కడికి పోయిండు.. 
ఎంపీగా ఓట్లు వేయించుకున్న కిషన్‌రెడ్డి పేదలు భయాందోళనకు గురవుతుంటే ఎక్కడికి పోయిండని కేటీఆర్‌ నిలదీశారు. అంబర్‌పేట పేదల ఓట్ల తో ఎంపీ అయి పదవులు అనుభవిస్తున్న కిషన్‌రెడ్డి కి, పేదల ఇళ్లు కూలుస్తామంటే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి సు««దీర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్, నేతలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌, చెరుకు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
కాన్వాయ్‌ అడ్డగింతతో ఉద్రిక్తత 
నల్లకుంట: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో తనను కించపరుస్తూ ఇష్టానుసారంగా పోస్టు లు పెడుతున్నారంటూ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. గ్రేటర్‌ హైదరాబాద్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోతా రోహిత్‌ ఆధ్వర్యంలో పలువురు నాయకులు విద్యానగర్‌ హిందీ మహావిద్యాలయ చౌరస్తా వద్ద కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సురేఖకు క్షమాణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ముషీరాబాద్‌ నియోజ కవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త హుస్సే న్‌ చేతికి గాయాలయ్యాయి. అయితే నల్లకుంట పోలీసులు అందరినీ చెదరగొట్టారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుస్సేన్‌ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ట్లు ఎస్‌హెచ్‌వో జగదీశ్వర్‌ రావు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement