న్యూఇయర్‌ వేడుకలకు దూరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం | Telangana Government Stays Away from New Year Celebrations | Sakshi
Sakshi News home page

న్యూఇయర్‌ వేడుకలకు దూరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Published Tue, Dec 31 2024 6:30 PM | Last Updated on Tue, Dec 31 2024 6:53 PM

Telangana Government Stays Away from New Year Celebrations

న్యూ ఇయర్‌కు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత వారం ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్  సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. అపర చాణక్యుడిగా పేరుగాంచిన మన్మోహన్  మృతికి కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఏడు రోజులు అన్ని పార్టీ కార్యక్రమాలు రద్దు చేసుకుంది.

ఈ తరుణంలో మన్మోహన్‌ సింగ్‌ సంతాప దినాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలకు హాజరు కావద్దని నిర్ణయం తీసుకుంది. వేడుకలకు దూరంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉండనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement