![Third Class Student Went To Police Station To Give Complaint Against Teacher - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/6/STUDENT-COMPLENTS-TO-SI_0.jpg.webp?itok=rrtmY5qS)
ఎస్సైకి ఫిర్యాదు చేస్తున్న విద్యార్థి అనిల్
బయ్యారం: ‘మేడం. నన్ను మా సారు ఉత్తుత్తిగానే కొడుతుండు. మా సారుపై కేసు పెట్టి అరెస్ట్ చేయండి మేడం’అంటూ ఓ విద్యార్థి ఎస్సైకి ఫిర్యాదు చేశాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన తేజావత్ విజయ కుమారుడు అనిల్ (8) బయ్యారంలోని నిర్మల్‌గ్రాం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.
శనివారం పాఠశాల కరస్పాండెంట్ సన్ని తనను కొట్టాడని, కేసు పెడదామని వరుసకు బాబాయ్ అయ్యే రామకృష్ణకు చెప్పాడు. దీంతో అతను అనిల్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. తనను సార్ కొట్టారని, అరెస్ట్ చేయండి అని ఎస్సై రమాదేవికి ఫిర్యాదు చేశాడు. దీంతో పాఠశాల కరస్పాండెంట్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు రమాదేవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment