![మాట్లాడుతున్న రాంకుమార్‌రెడ్డి, వేదికపై
ఆర్డీఓ మాలోల, ఎమ్మెల్సీ మురళీధర్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/13/12vgr121r-410004_mr_0.jpg.webp?itok=Ax43bd-i)
మాట్లాడుతున్న రాంకుమార్‌రెడ్డి, వేదికపై ఆర్డీఓ మాలోల, ఎమ్మెల్సీ మురళీధర్
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలను సమష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాపూరు మండలం పెంచలకోనలోని టీటీడీ కల్యాణ మండపంలో మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏ ర్పాట్లపై నెల్లూరు ఆర్డీఓ మాలోల, ఎమ్మెల్సీ మేరి గ మురళీధర్‌తో కలసి అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేసి విజయ వంతం చేయాలన్నారు. త్వరితగతిన భక్తులు స్వామవారిని దర్శనం చేసుకునేలా చర్య లు తీసుకోవాలని తెలిపారు. దేవస్థానం ఆవరణలోని విక్రయశాలలో ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీసుల నిరంతర పరివేక్షణ ఉండాలని, ఆహార పదార్ధాలు విక్రయాలు ఒకే చోట ఉండేలా చూడాలని, వైద్య, బస్సు సౌకర్యం, తాగు నీటి వసతి కల్పించాలని సూచించారు.
150 బస్సులను నడుపుతాం
బస్సుల్లో పాత చార్జీలే వసూలు చేస్తామని, సుమారు 150 బస్సులు అన్ని ప్రాంతాల నుంచి పెంచలకోనకు నడుపుతామని డీఎం అపిల్‌కుమార్ తెలిపారు. వైద్యులు 25 మందితో నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని వైద్యాధికారి ధర్మేంద్ర తెలిపారు. సీఐ కోటేశ్వరావు మాట్లాడుతూ సుమారు 400 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. దేవస్ధానం ఈఓ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ చలువ పందిళ్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం చైర్మన్ చెన్ను తిరుపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ నెల్లూ రు రవీంద్రారెడ్డి, ఏసీ శ్రీనివాసులరెడ్డి, ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వా మి, వైఎస్సార్ సీపీ నాయకులు పాపకన్ను మధుసూధన్‌రెడ్డి, జేసీఎ్‌స్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా పెంచలకోనలో టీటీడీ నిధులతో నిర్మించిన 32 అతిథి గృహాలను వినియోగంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తానని విలేకరులతో రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment