టీటీడీ చైర్మన్‌కు చెక్కు అందిస్తున్న దాతలు
తిరుమల: టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం రూ.30 లక్షలు విరాళంగా అందింది. విరాళం చెక్కులను దాతలు తిరుమలలోని కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. బెంగళూరుకు చెందిన మంజునాథ రెడ్డి, కృష్ణారెడ్డి కలిసి ఎస్‌వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు అందజేశారు. బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు ఆనందకుమార్ అనే భక్తుడు రూ.10 లక్షలు అందజేశారు.
వ్యక్తి ఆత్మహత్య
రామచంద్రాపురం: మండలంలోని శాఖమూరికండ్రిగ వద్ద గల గ్రానైట్ ఫ్యాక్టరీలో ఓ వ్యక్తి ఉరివేసుకుని తనువు చాలించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. రాజస్థాన్‌కు చెందిన మహేంద్ర (35) శాఖమూరికండ్రిగలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఎంతకీ తలుపు తీయకపోవడంతో తోటికూలీలు యజమాని వసంత నాయుడుకు సమాచారం అందించారు. ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఉరికి వేలాడుతున్న మహేంద్రను కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఐదు ఐచ్చిక సెలవులు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు ఐదు రోజులు ఆప్షనల్ హాలిడేస్ (ఐచ్చిక సెలవులు) ఉపయోగించుకోవచ్చని తిరుపతి జిల్లా డీఈఓ డాక్టర్ వి.శేఖర్, డీసీఈబీ కార్యదర్శి ఆర్.వంశీరాజ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న మొహర్రం, ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం, నవంబరు 27న కార్తీక పౌర్ణమి, డిసెంబరు 26న బాక్సింగ్ డే, 2024 జనవరి 1న వీటిని వినియోగించుకోవచ్చన్నారు. అలాగే లోకల్ హాలిడేస్ కింద మూడు రోజులు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా నిర్వహించే ముఖ్య పండుగలకు సంబంధిత ఉన్నతాధికారులు అనుమతి తీసుకుని సెలవులు తీసుకోవచ్చని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment