అమెరికా పర్యటనకు ఎస్వీయూ అధ్యాపకుల బృందం
● అభినందించిన వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు
తిరుపతి సిటీ: ఎస్వీయూలోని పలు విభాగాలకు చెందిన సుమారు ఆరుగురు అధ్యాపకుల బృందం ఈనెల 8వ తేదీన అమెరికా పుర్ద్యూ యూనివర్సిటీ పర్యటనకు వెళ్లనుంది. సుమారు 20రోజుల పాటు వర్సిటీలో పలు అంశాలపై శిక్షణ పొందనున్నారు. రుసా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంట్రపెన్యూర్‌షిప్ పరిశీలన చేసి వర్సిటీలో ప్రొత్సహించాలనే ఉద్ధేశంతో ఈ పర్యటను చేపట్టనున్నారు. శిక్షణకు హాజరవుతున్న వారిలో రుసా కో–ఆర్డినేటర్లు ప్రొఫెసర్ రమాశ్రీ, ప్రొఫెసర్ ఉషారెడ్డి, వైరాలజీ విభాగం ప్రొఫెసర్ ఎం హేమ, ఇంగ్లీషు విభాగం ప్రొఫెసర్ కొలకలూరి సుమకిరణ్, హోమ్‌సైన్స్ ప్రొఫెసర్ సుచరిత, రుసా సీఈఓ రాయల వంశీకృష్ణ ఉన్నారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ చేపట్టిన అంశాల్లో ఉత్తమ శిక్షణ తీసుకుని, విద్యార్థుల ఉన్నతికి వినియోగించాలని కోరారు. ఎస్వీయూ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో చాటాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment