● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుతున్న రోడ్లు ● కనీస భద్రతా చర్యలు చేపట్టని వైనం ● రూపురేఖలు కోల్పోతున్న తడ–శ్రీకాళహస్తి రోడ్డు ● ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు | - | Sakshi
Sakshi News home page

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుతున్న రోడ్లు ● కనీస భద్రతా చర్యలు చేపట్టని వైనం ● రూపురేఖలు కోల్పోతున్న తడ–శ్రీకాళహస్తి రోడ్డు ● ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

Published Fri, Nov 15 2024 1:26 AM | Last Updated on Fri, Nov 15 2024 1:26 AM

● ఓ వ

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత

వరదయ్యపాళెం : అటు గ్యాస్‌ పైపులైను.. ఇటు వాటర్‌ పైపులైన్ల పుణ్యమా అంటూ శ్రీకాళహస్తి–తడ ఆర్‌అండ్‌బీ రోడ్డును ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. తవ్విన మట్టిని రోడ్డుకు అడ్డదిడ్డంగా వేస్తున్నారు. రోడ్డు ధ్వంసమవుతున్నా కనీసం పనులు సాగుతున్నట్లు ఎక్కడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. గత ప్రభుత్వంలో ఏడాది కిందట రూ.10 కోట్ల వ్యయంతో రెన్యూవల్‌ చేసి రాకపోకలకు అద్దంలా సిద్ధం చేసిన రోడ్డు మార్గం నేడు పైపులైన్ల కోసం చేపడుతున్న తవ్వకాలతో ఛిద్రమైపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతూ వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

శ్రీసిటీ సెజ్‌ పరిశ్రమలోని అవసరాల కోసం తిరువళ్లూరు నుంచి రేణిగుంట మీదుగా శ్రీకాళహస్తి–వరదయ్యపాళెం వైపుగా శ్రీసిటీ సెజ్‌కు గ్యాస్‌ పైపులైను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కండలేరు నుంచి పరిశ్రమల అవసరాల కోసం శ్రీసిటీ సెజ్‌కు వాటర్‌ పైపులైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పైపులైను శ్రీకాళహస్తి మీదుగా వరదయ్యపాళెం నుంచి శ్రీసిటీ వరకు వెళ్తుంది. రెండు పైపులైన్లు శ్రీకాళహస్తి–తడ ఆర్‌అండ్‌బీ రోడ్డుకు రెండు వైపులా ఏర్పాటవుతున్నాయి. ఈ పనులను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్‌ నాలుగు నెలల నుంచి రోడ్డుకిరువైపులా పనులు చేపడుతున్నారు. అయితే రోడ్డుకు ఆనుకుని పైపులైన్ల కోసం గోతులు తీయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుబంధమైనవి కావడంతో పనులు వేగంగా సాగుతున్నాయి.

పైపులైన్లు ధ్వంసం

పైపులైన్ల ఏర్పాటుతో కొన్ని గ్రామాల వద్ద పంచాయతీ ప్రజలకు సరఫరా అయ్యే తాగునీటి పైపులైన్లు ధ్వంసమవుతున్నాయి. అంతేగాక కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. ధ్వంసమైన పైపులైన్లకు మరమ్మతులు చేయమని స్థానిక పంచాయతీ పాలకులు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. మండల కేంద్రమైన వరదయ్యపాళెంలో ఒకేచోట 20 సార్లు నీటి సరఫరా పైపులైన్లు ధ్వంసం చేయడంతో బాగుచేయలేక పంచాయతీ సిబ్బంది అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. నేటికీ వరదయ్యపాళెంలోని గోవర్థనపురం వద్ద సుమారు 100 మీటర్ల దూరం వరకు పైపులైను కోసం తవ్విన కాలువను పూడ్చకుండా అలాగే వదిలేశారు. దీంతో వర్షపునీరు ఆ కాలువలో నిండి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఈ కాలువ ఉండడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేగాక సత్యవేడు మార్గంలోని వెంకటరెడ్డికండ్రిగ, చెరివి రోడ్డు, శ్రీకాళహస్తి మార్గంలోని కారణిమిట్ట, నెలవాయి, బీఎన్‌కండ్రిగ, కుక్కంబాకం ఇలా పలుచోట్ల ప్రమాదకరంగా మట్టి కుప్పలు, గోతులు ఉన్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

భద్రతా ప్రమాణాలు పాటించలేదు

శ్రీకాళహస్తి–తడ ప్రధాన రోడ్డు మార్గంలో పైపులైన్ల కోసం చేపడుతున్న పనుల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఇంత నిర్లక్ష్యంగా చేపట్టడం సరికాదు.

–గురవయ్య, వాహనదారుడు,

వరదయ్యపాళెం మండలం

ప్రమాదాలు తప్పవు

శ్రీకాళహస్తి–తడ ప్రధాన రోడ్డుకు ఆనుకుని పైపులైన్ల కోసం చేపడుతున్న కాలువలు వాహనదారులకు రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా మారడం ఖాయం. కనీసం భద్రతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డుకు ఆనుకుని పైపులైను వేయడం సరికాదు.

–వినోద్‌ కుమార్‌యాదవ్‌,

వరదయ్యపాళెం

పర్యవేక్షిస్తున్నాం

తడ–శ్రీకాళహస్తి ప్రధాన రోడ్డు మార్గంలో రెండు పైపులైన్ల ఏర్పాటు పను లు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పనులు ఆలస్యం కావడంతో ఇటు వర్షాలకు, అటు గోతులలోకి నీరు రావడం, తవ్విన మట్టి రోడ్డుపై వేయడంతో రోడ్డు మరమ్మతులకు గురికావడం వాస్తవమే. మా సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. –రాంబాబు, డీఈ, శ్రీకాళహస్తి ఆర్‌ అండ్‌ బీ సబ్‌ డివిజన్‌

రూపురేఖలు కోల్పోతున్న రోడ్డు

శ్రీకాళహస్తి–తడ మార్గంలోని కడూరు కూడలి వరకు, సత్యవేడు–తడ రోడ్డు మార్గంలోని చిన్న పాండూరు వరకు 45 కి.మీల మేరకు రోడ్డు పూర్తిగా ఛిద్రమైంది. ఈ మార్గాలలో ఎక్కడపడితే అక్కడ పైపులైన్ల కోసం చేపట్టిన తవ్వకాలు అక్కడక్కడా వదిలి వేయడం, అంతేగాక తవ్వకాల ద్వారా తోడిన మట్టిని రోడ్డుకడ్డంగా వేసి వదిలేయడంతో ఆ మార్గం రూపురేఖలు కోల్పోతోంది. ఇది రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్డా? లేక గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్డా? అనే కోణంలో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏడాది క్రితం అద్దంలా అభివృద్ధి జరిగిన రోడ్డు మార్గం నేడు దుస్థితికి చేరుకోవడం పట్ల ఆ మార్గాల్లోని స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదమరిస్తే అంతే సంగతులు

ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించేందుకు గానీ, ఎదురుగా వస్తున్న వాహనానికి వైదొలగేందుకు ఏ మాత్రం తారురోడ్డు దిగితే కాలువలో కూరుకుపోవడం ఖాయం. ప్రధాన రోడ్డుకు ఆనుకుని రోడ్డుకు రెండు వైపులా కాలువలు కోసం తవ్వకాలు చేపట్టడం పెను ప్రమాదానికి దారి తీస్తుందని స్థానికులు చెబుతున్నారు. కనీసం రోడ్డుకు 5 మీటర్ల నిడివి ఉంచి పైపు లైన్లు ఏర్పాటు చేసుకుంటే బాగుండేదని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత1
1/7

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత2
2/7

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత3
3/7

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత4
4/7

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత5
5/7

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత6
6/7

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత7
7/7

● ఓ వైపు గ్యాస్‌ లైను.. మరోవైపు వాటర్‌ లైను ● ఛిద్రమవుత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement