తిరుపతి కల్చరల్: ప్రొఫెసర్ పీసీ.మహలనోబిస్ జ్ఞాపకార్థం ప్రదానం చేసే స్టాటిస్టిక్స్ ఇంటర్నేషనల్ అవార్డుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సెట్విన్ సీఈఓ కె.మోహన్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 2025 ఏడాదికి ఈ అంతర్జాతీయ అవార్డును ప్రముఖ గణాంకవేత్త, గణాంక సిద్ధాంతం, అభ్యాసం, ఉత్తమ గణాంక పద్ధతుల ప్రమోషన్‌లో గణనీయమైన కృషి చేసిన అభివృద్ధి చెందుతున్న దేశానికి చెందిన ఒక గణాంక నిపుణుడికి ఈ అవార్డును ప్రదానం చేస్తారన్నారు. అవార్డు కింద రూ.10వేలు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను నెదర్లాండ్‌లోని ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహణలో అందజేస్తారని తెలిపారు. గణాంకవేత్త, గణాంక సిద్ధాంతం, అభ్యాసంలో ప్రావీణ్యం ఉన్న వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో https://www.isi-web.org/call-nominations- 2025 isi-mahalanobis-international-award వెబ్‌సైట్‌లో డిసెంబర్ 31వ తేదీలోపు సమర్పించాలని తెలిపారు. ఈ అవార్డుకు సంబంధించిన మరింత సమాచారం కోసం https://www.is.web.org లో వీక్షించవచ్చని తెలిపారు. ఆసక్తి గలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
విద్యార్థి అదృశ్యం
కోట: తన కుమారుడు రషీద్ రెండు రోజులుగా కనిపించడం లేదని కోట ఎన్‌సీఆర్ నగర్‌కు చెందిన మహిళ బుధవారం కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలు ఈ నెల 18వ తేదీ పాఠశాలకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడని పేర్కొన్నారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో అంతా గాలించామని ఎక్కడా ఆచూకీ లేదని తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment