తిరుపతి సిటీ: ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీలలో ఎంఏ, ఎమ్‌కాం, ఎమ్మెస్సీతో పాటు పలు పీజీ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీచేసింది. పీజీ సెట్–2024 అర్హత సాధించని విద్యార్థులు, సెట్‌కు పరీక్షలు రాయని విద్యార్థులు సైతం ప్రవేశం పొందేందుకు వెసులుబాటు కల్పించింది. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండదు. త్వరలో వర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.
విద్యుత్‌షాక్‌తో ఆరు గేదెల మృతి
కోట: విద్యుత్ షాక్‌తో ఆరు గేదెలు మృతి చెందిన ఘటన మంగళవారం కోట మండలం, గూడలిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. గూడలిలో రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్న క్రమంలో టిప్పర్ ద్వారా కంకర తరలిస్తుండగా దానికి 11కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో వైరు తెగి రోడ్డుపై పడింది. అదే సమయంలో రోడ్డుపై ఆరు గేదెలు వెళ్తుండడంతో అవి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. వీటి విలువ రూ.4 లక్షలని బాధితుడు వాపోయాడు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment