వెటర్నరీలో జాతీయ పాల దినోత్సవం
తిరుపతి సిటీ: ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐడీఏ–ఏపీ) తిరుపతి చాప్టర్, వెటర్నరీ వర్సిటీ కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ సంయుక్తంగా మిల్క్ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ పాల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. డెయిరీ టెక్నాలజీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు డాక్టర్ వర్గీస్ కురియన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ‘రైతులు, గ్రామీణ మహిళలకు సాధికారత’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. డీన్ డాక్టర్ కె.నాగేశ్వరరావు, డాక్టర్ వై.రవీంద్రారెడ్డి, డాక్టర్ మంజునాథ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment