పనుల పురోగతిపై సమీక్ష
తిరుమల: తిరుమలలో టీటీడీ నిర్మిస్తున్న నూతన యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ–5) భవన నిర్మాణ పనుల పురోగతిపై టీటీడీ అడిషనల్ ఈఓ సీహెచ్.వెంకయ్యచౌదరి మంగళవారం అన్నమయ్య భవన్‌లో అధికారులతో సమీక్షించారు. అనంతరం అడిషనల్ ఈఓకు నిర్మాణ పనుల స్థితి గురించి ఇంజినీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా 16 హాళ్లలో 8 హాళ్లలో ఫ్లోరింగ్ పూర్తయిందని, మిగిలిన పని చేయాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా పీఏసీ–5లో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాదం డైనింగ్ హాల్, కల్యాణ కట్ట, డిస్పన్సరీ సదుపాయాలపై అధ్యయనం చేశారు. డిప్యూటీ ఈఓలు రాజేంద్ర, భాస్కర్, వెంకటయ్య, ఆశాజ్యోతి, ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, ఈఈలు వేణు గోపాల్, సుధాకర్, ఎలక్ట్రికల్ డీఈ చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ ప్రసాద్, అశ్వినీ ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 7 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 63,637 మంది స్వామివారిని దర్శించుకోగా 24,016 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.2 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment