ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
శ్రీకాళహస్తి రూరల్: మండల పరిధిలోని ఊరందూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో రచించిన రాజ్యాంగాన్ని గ్రామస్తులు ఆమోదించారు. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదిరి పాఠశాల రాజ్యాంగ పరిషత్‌ను నిర్వహించారు. ఇందులో 193 మంది విద్యార్థులు రాజ్యాంగ పరిషత్ సభ్యులు లాగా హాజరయ్యారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, ఆదేశ సూత్రాలు, కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, భాషలు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ ప్రవేశికను సామూహిక పఠనం నిర్వహించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా రాజకుమారి, పాఠశాల రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్ గా కూనాటి సురేష్, హక్కుల కమిటీ చైర్మన్‌గా రమేష్‌బాబు, విధుల కమిటీ చైర్మన్‌గా శ్రీనివాసులు, అధికారాల కమిటీ చైర్మన్‌గా మురళి, విధివిధానాల కమిటీ చైర్మన్‌గా రజియా, మైనారిటీ, వెనుకబడిన తరగతుల కమిటీ చైర్మన్‌గా మల్లికార్జున, ఆర్థిక కమిటీ చైర్మన్‌గా శాంతి, ఇతర కమిటీలకు చైర్మన్‌లుగా సుమతి, బిందు వ్యవహరించారు. అదే విధంగా రాచగున్నేరి పాఠశాలలో సర్పంచ్ డాక్టర్ భార్గవి, మాజీ సర్పంచ్ బొల్లినేని జగన్నాథంనాయుడు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment