విహంగామా!
● కిటకిటలాడిన నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ● తండోపతండాలుగా తరలివచ్చిన విద్యార్థులు ● అవగాహన కల్పించిన ఫారెస్ట్ సిబ్బంది
దొరవారిసత్రం: విదేశీ విహంగాల కిలకిల రావాలు, చిలిపి చేష్టలు, ఈత కొట్టడాలు పక్షి ప్రేమికులను కట్టిపడేశాయి. బంగాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వీపరీతమైన చలిగాలులు, చినుకులు పడుతున్నా ఇవేవీ లెక్కచేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మంగళవారం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడ విడిది చేసే విదేశీ శీతాకాలపు విహంగాలను తిలకించి ఉప్పొంగిపోయారు. తిరుపతి, చిత్తూరు, గూడూరు, నెల్లూరు పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పక్షుల కేంద్రానికి విచ్చే.. కడప చెట్లపై విడిది చేసే విహంగాలను బైనోక్యూలర్స్ ద్వారా వీక్షించారు. ప్రస్తుతం గూడబాతులు, నత్తగుళ్ల కొంగలు, తెల్లకంకణాయిలు, నీటికాకులు తదితర పక్షులు పిల్లలు పొదిగి కిలకిలరావాలు, కేరింతలు కొడుతున్నాయి. వీటి చేష్టలు వీక్షకుల కళ్లు తిప్పనివ్వలేదు. గూడబాతుల విన్యాసాలు, ఈత కొడ్డటం పక్షి ప్రేమికులను కట్టిపడేశాయి. విహంగాల ప్రత్యేకత, వాటి ప్రాధాన్యత గురించి చెరువు కట్టపై ఉన్న వ్యూ పాయింట్లు వద్ద నేచర్ గైడ్ హుస్సేన్, ఫారెస్ట్ సిబ్బంది అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment