మహిళ అదృశ్యం
శ్రీకాళహస్తి: పట్టణానికి చెందిన పి.వరలక్ష్మి(35) అదృశ్యమైంది. ఆమె భర్త హరికుమార్ కథనం మేరకు.. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వరలక్ష్మి ఆ తర్వాత ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వెదికినా ఫలితం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 9182492884, 9441716259 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
కానిస్టేబుల్‌కు ఏడాది జైలు
తిరుపతి లీగల్: చెక్ బౌన్స్ కేసులో 2019లో అలిపిరి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పీ.లాల్‌ఖాన్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తిరుపతి మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి మంగళవారం తీర్పు చెప్పారు. తిరుపతి ఎస్పీ అర్బన్ ఆఫీసులో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న ఎం.మోహన్‌రెడ్డి వద్ద లాల్‌ఖాన్ 2019 డిసెంబర్ మూడో తేదీ రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని ప్రో నోటు రాసి ఇచ్చాడు. ఆ సొమ్ము అతను తిరిగి చెల్లించకపోవడంతో మోహన్‌రెడ్డి నోటీసు ఇచ్చాడు. దీంతో లాల్‌ఖాన్ 2021 ఆగస్టు 15వ తేదీ చెక్కును మోహన్‌రెడ్డికి ఇచ్చాడు. ఆ చెక్కును అతను 2021 ఆగస్టు 31వ తేదీ బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయ్యింది. దీంతో అతను లాల్‌ఖాన్ పై కోర్టులో చెక్కు బౌన్స్ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి లాల్ ఖాన్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
రైలు కిందపడి
యువకుడి మృతి
రేణిగుంట: రేణిగుంట –ఏర్పేడు రైలు మార్గంలో రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రేణిగుంట జీఆర్పీ ఎస్‌ఐ రవి తెలిపిన వివరాలు... రేణిగుంట– ఏర్పేడు మధ్యలో గూడ్స్ రైలు ఢీకొని గుర్తుతెలియని సుమారు 28 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందాడు. మృతుడు గ్రే మెరూన్ కలర్ డ్రాయర్, ఆకుపచ్చ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. మృతుని ఆచూకీ తెలిసినవారు రేణిగుంట రైల్వే పోలీస్ 9963126343 నంబర్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment