ఊర్లో లేని వారి పేర్లు మస్టర్లో! | - | Sakshi
Sakshi News home page

ఊర్లో లేని వారి పేర్లు మస్టర్లో!

Published Sat, Dec 21 2024 1:09 AM | Last Updated on Sat, Dec 21 2024 1:09 AM

ఊర్లో లేని వారి పేర్లు మస్టర్లో!

ఊర్లో లేని వారి పేర్లు మస్టర్లో!

● కలువాయి మండలంలో భారీ అవినీతి ● రూ.58 లక్షలకుపైగా స్వాహా ● ఊర్లో లేని వారి పేర్లు రాసి డబ్బులు నొక్కిన వైనం ● ఆరుగురు ఉపాధి స్బిబందిపై క్రిమినల్‌ కేసులకు సిఫార్సు

కలువాయి: కలువాయి మండలంలో ఆరుగురు ఉపాధి ిసిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఎంపీడీఓ డీవీ నరసింహారావు శుక్రవారం స్థానిక పోలీసులను ఆదేశించారు. చినగోపవరం ఎఫ్‌ఏ మహేంద్రరెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పీ.బాబు రాజేష్‌, సాంకేతిక సహాయకులు ఆర్‌.ప్రసన్న, ఎంవీ.ప్రసాద్‌, వెం.వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ జే.శ్రీనయ్యపై ఫిర్యాదు చేశారు. 2022–23లో జరిగిన ఉపాధి పనుల్లో రూ.58 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు 16వ విడత సామాజిక తనిఖీల్లో వెలుగులోకి రావడం, అనంతరం విచారణలో అది నిజమని తేలడంతో వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుకు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. వారిపై పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేసి, ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమకు పంపాలని డ్వామా నెల్లూరు జిల్లా కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పంపిన ఆదేశాలు శుక్రవారం తనకు అందినట్లు ఎంపీడీఓ పేర్కొన్నారు. ఈమేరకు తాను కలువాయి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.

భారీగా అవినీతి

కలువాయి మండలంలో 2022–23 మధ్య కాలంలో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంది. ఒక్క చినగోపవరం పంచాయతీలోనే రూ.50 లక్షల మేర అవినీతి జరింది. దీనితిపై రాష్ట్ర విజిలెన్స్‌ అధికారి భవానీ హర్ష విచారణ జరిపారు. గ్రామంలో లేని 148 మందిని మస్టర్లలో ఎక్కించి వారి పేరున బిల్లులు చెల్లించి ఎఫ్‌ఏ మహేంద్ర, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పీ.బాబు రాజేష్‌ రూ.25.5 లక్షలు అవినీతికి పాల్పడినట్లు బయటపడింది. వారు ఎవరూ ఆ గ్రామానికి చెందిన వారు కాకపోవడం, పలు రాష్ట్రాలలో ఉన్న వారి అకౌంట్లకు నగదు జమైనట్టు తేలింది. అదే కాలంలో ఇక్కడ టీఏలుగా పనిచేసిన ఆర్‌.ప్రసన్న, ఎంవీ.ప్రసాద్‌, ఎం.వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ జే.శ్రీనయ్య మరో రూ.32.87 లక్షల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేల్చారు. ఈ మేరకు ఆయన ఉన్నతాధికారులకు నివేదికను అందజేయడంతో వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

అంబుడ్స్‌మెన్‌ పాత్ర కీలకం

కలువాయి మండలం, చినగోపవరం ఉపాధి పనుల్లో జరిగిన అవినీతిని వెలుగులోకి తేవడంతో అంబుడ్స్‌మన్‌ వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించారు. గ్రామంలో జరిగిన ప్రతి పనిపైనా నిఘా పెట్టారు. ఉపాధి కూలీలతో మమేకమై ఇక్కడ జరిగిన అవినీతిని వెలుగులోకి తెచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement